ఆ ఆత్యయిక స్థితినాటి చీకటి రోజులను ఎప్పటికీ మరచిపోలేం. 1975 నుంచి 1977 మధ్య రాజ్యాంగ సంస్థలు క్రమంగా విచ్ఛిన్నం కావడం మనకు కనిపిస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తూ, రాజ్యాంగంలో పొందుపరచిన విలువలకు అనుగుణంగా జీవిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం. మన ప్రజాస్వామ్య నీతిని కాంగ్రెస్ అణచివేసింది.
ఆ చీకటి రోజులకు వ్యతిరేకంగా ప్రతిఘటించి, భారత ప్రజాస్వామ్య రక్షణకు పాటుపడినవారంతా చిరస్మరణీయులు అంటూ మోదీ వరుస ట్వీట్లు చేశారు. అలాగే డార్క్‌డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అనే హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేశారు. అంతేకాకుండా బీజేపీ ఫర్ ఇండియా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన పోస్టును జోడించారు.