23న దేశవ్యాప్త సమ్మె

సోమవారం, 21 సెప్టెంబరు 2020 (07:14 IST)
కార్మిక విధ్వంసక విధానాలు, వేతనాల కోతలు, ఉద్యోగ భద్రత కోసం ఈనెల 23వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికవర్గం  సమ్మె చేపట్టాలని నిర్ణయించింది.

దీని గురించి ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని  పిలుపునిచ్చారు. సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని కేంద్రానికి తమ నిరసన తెలపాలని రవీంద్రనాథ్‌ కోరారు.

కేంద్ర ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వులు, ఆర్డినెన్స్‌ల ద్వారా కార్మిక హక్కులను అణచి వేయడానికి, కార్మిక చట్టాల సవరణల పేరుతో మార్చడానికి పూనుకుంటున్నదని విమర్శించారు.

కీలకమైన ఆర్థిక రంగాలు రైల్వే, రక్షణ, ఉక్కు,పెట్రోలియం, విద్యుత్‌, బీమా లాంటి ప్రభుత్వ రంగ సంస్థ లలో పెట్టుబడుల ఉపసంహరణ చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు, కార్పోరేట్‌ వర్గాలకు కట్టబెట్టేందుకు సకల విధాలా ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో బేవరీ జస్‌ హమాలీ కార్మికులు, సివిల్‌ సప్లయిస్‌ హమాలీ కార్మికుల వేతన ఒప్పంద అగ్రిమెంట్‌ పూర్తయి 6 మాసాలు గడిచినా ప్రభుత్వం తిరిగి వేతన ఒప్పందం చేసుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు.

దానికి నిరసనగా రాష్ట్రంలో నెలరోజులుగా బేవరీ జస్‌ హమాలీలు శాంతియుత నిరసన తెలియజేస్తున్న ప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తక్షణమే నూతన వేతన ఒప్పందం చేసి బేవరీజస్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రవీంద్రనాధ్‌ కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు