ఎన్డీయే కూటమి నేతగా నరేంద్ర మోడీ - హాజరైన బాబు - పవన్

వరుణ్

బుధవారం, 5 జూన్ 2024 (19:21 IST)
ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రధాని నివాసంలో గంటకు పైగా జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పార్టీ నేతల సమాశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌ కుమార్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్‌ నేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేడీఎస్‌ నేత కుమారస్వామి, చిరాగ్‌ పాసవాన్‌ తదితరులు హాజరయ్యారు.
 
'మోడీ సారథ్యంలో పదేళ్లుగా ప్రజాసంక్షేమ విధానాల కారణంగా 140 కోట్ల మంది దేశ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. చాలా సుదీర్ఘ విరామం.. దాదాపు 6 దశాబ్దాల తర్వాత దేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో ఐక్యంగా పోరాడి గెలిచినందుకు గర్విస్తున్నాం. భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా.. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది' అని తీర్మానంలో నేతలు పేర్కొన్నారు. 
 

NDA meeting concludes at PM residence.

Chandrababu Naidu and Nitish Kumar give support to BJP.

10 Independent MP's reportedly also give support to BJP.

NDA to now stake claim to form govt at Rashtrapati Bhawan.

Narendra Modi to be Prime Minister for 3rd consecutive term pic.twitter.com/VSMXezTYxw

— Megh Updates(@MeghUpdates) June 5, 2024
ఉత్తరప్రదేశ్‌లో కమలదళాన్ని అయోధ్య రాముడు ఎందుకు గట్టెక్కించలేదు? 
 
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చావు దెబ్బ తగిలింది. 84 ఎంపీ సీట్లు ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. పైగా బీజేపీ పాలనలో ఈ రాష్ట్రం ఉంది. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు మరోలా స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. ఫలితంగా కమలం పార్టీకి తేరుకోలేని షాకిచ్చారు. నిజానికి కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్‍‌ సారథ్యాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉండటంతో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఊకదంపుడు ప్రచారం చేసుకున్నారు. 
 
ఈ ప్రచారం యూపీ ఓటర్ల మనసులను గెలుచుకోలేక పోయింది. పైగా, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా ఆ పార్టీకి ఓట్లు కురిపించలేక పోయాయి. అయోధ్య గుడి ఉన్న ఫైజాబాద్‌లో కూడా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇలా అనేక అంశాల్లో డబుల్‌ ఇంజిన్‌ మొరాయించి ఫలితాలు ఇవ్వలేదు. దీంతో తప్పు ఎక్కడ జరిగిందనే అంశంపై ఇప్పుడు కమలనాధుల్లో అంతర్మథనం మొదలైంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ బలమైన సోషల్‌ ఇంజినీరింగ్‌తో ఈసారి ఎన్నికలకు సిద్ధమైంది. ఈ క్రమంలో పీడీఏ (వెనుకబడిన, మైనార్టీ, దళిత్‌) వ్యూహంతో ఆ వర్గాల ఓటర్లను ఆకర్షించింది. 
 
రాష్ట్రంలో నాలుగు ఎన్నికల్లో విజయానికి యోగి నేతృత్వం వహించారు. 2022 అసెంబ్లీ, 2019 లోక్‌సభ, రెండు స్థానికసంస్థల ఎన్నికలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిల్లో భాజపా విజయాలు సాధించింది. ఈసారి టికెట్ల కేటాయింపుల్లో అభ్యర్థులపై స్థానిక వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలూ ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ ఓటమికి అదే బలమైన కారణంగా నిలిచింది. యోగి ఆదిత్యనాథ్ మాత్రం టికెట్ల కేటాయింపును పూర్తిగా కేంద్ర నాయకత్వానికే వదిలేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ప్రచార బాధ్యత యోగి తీసుకొన్నారు. ఆయన రాష్ట్రంలో, బయట 170 ర్యాలీలు నిర్వహించడంతోపాటు.. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో పర్యటించారు. 
 
రామాలయం నిర్మించిన అయోధ్యలో (ఫైజాబాద్‌)లో భాజపా ఓడిపోవడాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. బీజేపీకి జీవం పోసిన అయోధ్య ఉద్యమానికి ఓ సానుకూల ముగింపు ఇచ్చినా.. ఎస్పీ అభ్యర్థి అవధేష్‌ ప్రసాద్‌నే విజయం వరించింది. దీంతో ఈ అంశం తమకు ఎన్నికల్లో ఉపయోగపడలేదని పార్టీ అంచనా వేసింది. 
 
ఇంకోవైపు, యూపీలో బీఎస్పీ బలహీనపడటం కూడా కాంగ్రెస్‌-సమాజ్‌వాదీకి కలిసొచ్చింది. 2014లో బీఎస్పీకి సీట్లు రాకపోయినా.. 2019లో పుంజుకొని 10 చోట్ల విజయం సాధించింది. అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీతో జట్టు కట్టింది. కానీ, ఈసారి సొంతంగా బరిలో నిలవడంతో గతంలో వచ్చిన 19 శాతం ఓట్లను నిలబెట్టుకోలేక సింగిల్‌ డిజిట్‌కు పరిమితమైంది. రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్‌-సమాజ్‌వాదీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఫలితంగా బీఎస్పీ ఓట్లు వాటికి మళ్లాయి. దీంతో రాష్ట్రంలో ఇండియా కూటమి ఓట్ల శాతం 40 శాతానికి చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు