గంగానదిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. దేవుడిలా కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది (వీడియో)

సెల్వి

మంగళవారం, 23 జులై 2024 (12:48 IST)
Ganga
దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కీలకమైన నీటి ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి. గోదావరి, పోలవరం ప్రాంతాల్లో నీటి ప్రవాహం అధికమైంది. 
 
ఇంకా వరదల కారణంగా ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. కానీ ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే తరహాలో ఉత్తరాదిన కూడా భారీ వర్షపాతం నమోదవుతోంది. 
 
ముంబై, మహారాష్ట్రల్లో భారీ వరదలు కురిశాయి. ఈ క్రమంలో గంగానదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో గంగా వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. 
 
గంగా నదిలో వరద ప్రవాహానికి కాపాడండి అంటూ కేకలు పెడుతూ కొట్టుకుపోతున్న వ్యక్తిని.. దేవుడిలా వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా వరద నీటి నుంచి బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

దేవుడిలా వెళ్లి కాపాడారు గంగా నదిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన NDRF సిబ్బంది #GangaRiver #HeavyRain pic.twitter.com/AYcRMetiuq

— ???? (@TEAM_CBN1) July 23, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు