భారత్-నేపాల్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇందుకు కారణం చైనాకు చెక్ పెట్టే రైల్వే డీల్‌లో భారత్-నేపాల్ ఒప్పందం కుదుర్చుకోవడమే. చైనా రైల్వేస్ నేపాల్‌లోకి రాకుండా ముందస్తు ప్రణాళికలు వేసిన భారత ప్రభుత్వం నేపాల్‌తో రైల్వే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కొద్దినెలల కింద భారత్‌తో నేపాల్ కొన్ని విషయాల్లో విబేధించిన సంగతి తెలిసిందే.
కొన్ని దశాబ్దాల పాటూ భారత్ తో సత్సంబంధాలు కలిగిన నేపాల్ ఇటీవల మ్యాపుల్లో భారత్‌కు చెందిన ప్రాంతాలను తమ ప్రాంతాలుగా చెప్పుకుంది. అయోధ్య గురించి కూడా నేపాల్ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేసి.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. మరోవైపు భారత్ నేపాల్‌తో సంబంధాల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. భారత్‌కు చెందిన ఉన్నతాధికారులు నేపాల్‌లో పర్యటించి సత్సంబంధాలు మెరుగుపడడానికి కృషి చేశారు.