లాక్‌డౌన్ విజయవంతమైనా...?
లాక్‌డౌన్ విజయవంతమైనా కరోనా వైరస్ కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో మాత్రం విఫలమైందని ఎయిమ్స్ డైరెక్ట్రర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా పేర్కొన్నారు. అలాగే కరోనా వైరస్ కేసుల సంఖ్య కూడా ఇంకా వేగవంతం కాలేదని అన్నారు.
మన జనాభా అధికంగా ఉండటంతో యూరప్ దేశాలతో పోల్చలేమని, యూరప్‌లో రెండు మూడు దేశాల జనాభాను కలిపినా మన దేశ జనాభాకు సమానం కాదని అన్నారు. ఆయా దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని వివరించారు.