సీనియర్ లాయర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు

శుక్రవారం, 12 జులై 2019 (16:50 IST)
ఢిల్లీలో సీనియర్ లాయర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు చేసింది. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే సోదాలు కొనసాగాయి. సీనియర్ లాయర్లు.. ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్ ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ చట్టాన్ని వారు ఉల్లంఘించారని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు జరిగాయి. ఆనంద్ గ్రోవర్, అతని ఎన్జీవో లాయర్లు విదేశాల నుంచి నిధులు సేకరించినట్టు కేసు నమోదైంది. 
 
మానవ హక్కుల గురించి పోరాడుతున్నందునే… తమను మోడీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఇందిరా జైసింగ్ ఆరోపించారు. ఈమె సోనియా గాంధీకి అత్యంత సన్నిహితురాలు. మరోవైపు.. సీనియర్ లాయర్ల ఇళ్లపై సీబీఐ దాడులను విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ముక్తకంఠంతో ఖండించారు. ఇది బెదిరింపు చర్యేనని అభిప్రాయపడ్డారు. దాడులు సరికాదంటూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, సీపీఐ, సీపీఎం ఎంపీలు.. ఈ లేఖపై సంతకాలు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు