చైనాలో మరో ప్రమాదకర స్వైన్ ప్లూ వైరస్, G4గా నామకరణం

మంగళవారం, 30 జూన్ 2020 (14:39 IST)
ఇప్పటికే చైనా నుంచి విస్తరించిన కరోనావైరస్ తో ప్రపంచం గడగడలాడిపోతుంటే మళ్లీ ఆ దేశం నుంచే మరో ప్రమాదకర వైరస్ పుట్టింది. గతంలో వచ్చిన స్వైన్ ప్లూ వైరస్ కంటే ఇది చాలా డేంజర్ అని చెపుతున్నారు. చైనాలో కనిపించే కొత్త స్వైన్ ఫ్లూ ప్రాణాంతక సామర్థ్యాన్ని కలిగి 
ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
 
ఇది "మానవులకు సోకడానికి అత్యంత అనుకూలంగా ఉండటానికి అవసరమైన అన్ని లక్షణాలను కలిగి ఉందని చైనీస్ విశ్వవిద్యాలయ మరియు “చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్” శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2011 నుండి 2018 వరకు, శాస్త్రవేత్తలు 10 చైనా ప్రావిన్సులలో మరియు పశువైద్య ఆసుపత్రిలలో, కబేళాలలో పందుల నుండి 30,000 స్వాబ్‌లను తీసుకొని పరిశోధనలు చేశారు.
 
179 రకాల ప్లూ వైరస్‌లలో G4 కొత్తరకం, 2016 నుంచి పందులలో ఎక్కువగా కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు. G4 అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధిగా గుర్తించబడిందని, మరియు ఇతర వైరస్‌ల కంటే మరింత తీవ్రమైన లక్షణాలను కలిగి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మానవులు రోగనిరోధక శక్తి, G4 నుంచి ఏమాత్రం రక్షణ ఇవ్వలేదని పరీక్షలు నిరూపించినట్లు వెల్లడించారు.
 
చైనా జనాభాలో 4.4 శాతం మందికి ఇది సోకిందనీ, ఆ మేరకు రోగులకు ఈ లక్షణాలు బయటపడినట్లు పరీక్షల్లో తేలింది. వైరస్ ఇప్పటికే జంతువుల నుంచి మానవులకు చేరింది. కాని ఇది మానవుడి నుంచి ఇతర మానవులకు చేరగలదనే దానిపై ఇంకా ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు