జూలై 1 నుంచి కొత్త కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే కార్మికుల వేతనాలు, పీఎఫ్‌తో పాటు పనిగంటలు సహా ఇతర అంశాల్లో మార్పులు రానున్నాయి. పెట్టుబడులను, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి నాలుగు కొత్త కార్మిక చట్టాలను తెస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం వెల్లడించింది.
వేతనాలు, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, రక్షణ, పని పరిస్థితులు తదితర అంశాల్లో ఆశిస్తున్న సంస్కరణలు ఈ చట్టాల ద్వారా సాధించాలని భావిస్తోంది. కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే, అధికారిక పనిగంటలు పెరుగుతాయి.
ఈ చట్టాలు అమల్లోకి వస్తే, అన్ని కంపెనీలు కార్మికులకు వారానికి రెండు, నుంచి మూడు రోజులు వీకాఫ్ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త వేతన కోడ్ ప్రకారం.. వారానికి 48 గంటలు ఉద్యోగి పని చేయాల్సి ఉంటుంది.. ఏ సమయాలు అనేది పూర్తిగా ఆయా కంపెనీల నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది..