అయితే జరిగిన ఘటనపై రక్తం మరిగిన గ్రామస్థులు.. కామాంధులను కఠినంగా శిక్షించాలంటూ ఏకమయ్యారు. 44 వ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు ఊరంతా కలిసి.. పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించింది. స్టేషన్ ముందే కూర్చొని.. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ గ్రామస్థులు చేశారు. అమ్మాయిల రక్షణకు ఎన్నిచట్టాలు తీసుకొస్తున్నా.. వారి ప్రాణాలకు భరోసా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.