భారత్, చైనా మధ్య జరుగుతున్న సరిహద్దు ఘర్షణలపై ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 20 రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. కానీ ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, బీహార్‌లో ప్రతిపక్షపార్టీ రాష్ట్రీయ జనతా దళ్‌లను ఆహ్వానించలేదు.
అయినా, అతి ముఖ్యమైన అంశాన్ని చర్చించే ఈ సమావేశంలో అప్ పాల్గనకూడదని బిజెపి భావిస్తోంది'' అని సంజరుసింగ్ ట్వీట్ చేశారు. కాగా ఈ సమావేశానికి రాష్ట్రీయ జనతాదళ్‌కు కూడా ఆహ్వానం అందలేదు. ''మా పార్టీకి ఆహ్వానం అందకపోవడం విచారకరం. దురదృష్టకరం.
దీనిపై ప్రభుత్వం వివరణనిచ్చింది. జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన వాటిని, ఐదుగురు కన్నా ఎక్కువ ఎంపీలు ఉన్న పార్టీలను, కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలను, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీలకు మాత్రమే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం పలికినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.