మిగతా సంస్థలు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఆంక్షలు సడలిస్తారని, ఇందులో తమ సర్వీసులు కూడా ఉంటాయని భావిస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా గత నెల 24 నుంచి విమాన సర్వీసులు నిలిపోయాయి.
రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. గూడ్స్, నిత్యావసర సరుకులు, వైద్య సేవల కోసం మాత్రమే కొన్ని విమానాలు, రైళ్లు నడుస్తున్నాయి. ఈ నెల 14 వ తేదీతో లాక్‌డౌన్ పూర్తి కావడం, దాన్ని పొడిగించే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాల సమాచారంతో దేశీయ విమాన సర్వీసులు మళ్లీ మొదలుకానున్నాయి.