జమ్ముకశ్మీర్లో అంతర్జాల సేవలు సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. దాదాపు ఐదు నెలలుగా నిలిచిపోయిన 2జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలు ఇవాళ్టి నుంచి ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.
జమ్ముకశ్మీర్లో దాదాపు 5 నెలల క్రితం నిలిచిపోయిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ 2జీ మొబైల్ అంతర్జాల సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 2జీ ఇంటర్నెట్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.