ఈయన విజయవాడ ఇంటి నుంచి కొన్ని సామానులను పార్శిల్‌లో ఒడిషాకు కొరియర్‌లో తరలించాడు. ఈ కొరియర్ నుంచి వచ్చిన పార్సిల్‌ను విప్పుతుండగా అందులోంచి పాము బయటికి రావడంతో విస్తుపోయారు. పార్సిల్‌లో పాము బయటపడిన విషయాన్ని ముత్తుకుమరన్ అటవీ అధికారులకు తెలుపగా వారు అక్కడికి చేరుకుని పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
15 రోజుల క్రితం తాను ప్రైవేట్ కొరియర్ ఏజెన్సీ నుంచి పార్సిల్‌ను బుక్ చేశానని ముత్తుకుమరన్ తెలిపారు. ఈనెల 9న గుంటూరు నుంచి ఈ పార్సిల్ తనకు పంపారని చెప్పారు. గృహోపకరణాలతో కూడిన ఈ పార్సిల్‌ను విప్పిచూస్తుండగా అందులో పాము కనిపించడంతో షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఒడిషాకు పార్సిల్‌ను తరలించే క్రమంలో పాము ఇందులోకి చేరిఉంటుందని ఆయన చెప్పారు.