అత్తను బుగ్గగిల్లిన మేనల్లుడు.. ఫిర్యాదు చేసినందుకు అలా చేశారు...

సోమవారం, 26 ఆగస్టు 2019 (12:37 IST)
మామ ఇంట్లో లేని సమయంలో అత్త బుగ్గను మేనల్లుడు గిల్లి, అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై గ్రామ పంచాయతీ పాటు.. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బాధితురాలికే గుండు కొట్టించారు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్ రాష్ట్రంలోని కోడెర్మా జిల్లా దంగోడి గ్రామానికి చెందిన ఓ వివాహిత తన భర్తతో కలిసి జీవిస్తోంది. ఈమె ఇంటికి వరుసకు మేనల్లుడయ్యే 22 యేళ్ల యువకుడు రోజూ వచ్చివెళ్లేవాడు. ఈ క్రమంలో ఈ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను బుగ్గ గిల్లడంతో పాటు.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. గత మూడు నెలలుగా ఇదే తంతు కొనసాగుతూ వచ్చింది. ఈ వేధింపులను భరించలేని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ విషయం తెలుసుకున్న యువకుడు.. ఆ గ్రామ మహిళా పంచాయతీ సభ్యులను కలిసి బాధిత మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉందని, ఈ సంబంధం కొనసాగించాల్సిందిగా తనను వేధిస్తోందంటూ ఆరోపించాడు. దీంతో వాళ్లంతా ఆమె ఇంటికి చేరుకుని బయటికి లాక్కొచ్చి అర్థనగ్నంగా మార్చి తీవ్రంగా దాడి చేశారు. 
 
తప్పు చేశావంటూ ఆమె జట్టు కత్తిరించి  పంచాయతీ వద్దకు ఈడ్చుకువచ్చారు. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో 11 మంది వ్యక్తులకు సంబంధం ఉన్నట్లుగా గుర్తించి వారిని విచారిస్తున్నామని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు