ది లీడర్ : మహిళా బెగ్గర్‌కు అంత్యక్రియలు నిర్వహించిన ఎమ్మెల్యే...

ఆదివారం, 5 ఆగస్టు 2018 (16:39 IST)
నేటి రాజకీయ నాయకులపై ఓటర్లకు ఏమాత్రం గౌరవమర్యాదలు లేవు. కానీ, అలాంటి రాజకీయ నాయకుల్లో కూడా ఏ నూటికో కోటికో ఒక్కరుంటారు నిజమైన నాయకుడు. అలాంటి నాయకుడే ఈ ఎమ్మెల్యే. అనాథగా పడివున్న ఓ మహిళ బిచ్చగత్తె శవానికి ఎమ్మెల్యే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి నిజమైన నాయకుడు అనిపించుకున్నారు. ఆయన పేరు రమేష్ పతువాకి. రాష్ట్రం ఒడిషా. బీజేడీ శాసనసభ్యుడు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషాలోని జర్సుగూడా జిల్లాలోని అమ్నపల్లి గ్రామంలో అనారోగ్యంతో మంచానపడి ఉన్న ఓ మహిళ బెగ్గర్‌ శుక్రవారం కన్నుమూసింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానికులెవ్వరూ ముందుకురాలేదు. ఒక రోజు అంతా ఆమె మృతదేహాన్ని గ్రామస్థులు ఎవ్వరూ పట్టించుకోలేదు. పైగా, బెగ్గర్ మహిళ మృదేహాన్ని ఎవరైనా తాకితే ఊరి బహిష్కరణ చేస్తామంటూ గ్రామ పంచాయతీ పెద్దలు హెచ్చరించారు. దీంతో ఆమెకు అంత్యక్రియలు చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకురాలేదు. 
 
ఇంతలో అదే ఏరియాలో జరగాల్సిన ఓ కార్యక్రమానికి రెంగలి స్థానం బీజేడీ ఎమ్మెల్యే రమేష్ పతువాకి దృష్టికి ఈ మహిళ బిచ్చగత్తె వ్యవహారం వచ్చింది. వెంటనే తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తన ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని మహిళ మృతదేహం దగ్గరకు వెళ్లాడు. తన ఇద్దరు కొడుకులతో సాయంతో మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్లి సంప్రదాయబద్దంగా ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు. ఆ ఎమ్మెల్యే చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. నిజమైన దేవుడు ఆ ఎమ్మెల్యే అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన ప్రజల మనిషివని నిరూపించావయ్యా అంటూ ఎమ్మెల్యేని అభినందిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు