తెలంగాణ రాష్ట్రాల్లో జూలై మొదటి వారం నుంచి వర్షాలు

శుక్రవారం, 29 జూన్ 2018 (13:31 IST)
ఉత్తరాదిని భారీ వర్షాలు కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచేశాయి. కేరళ, ముంబైలలో వరద బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జులై మొదటి వారంలో భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
వాస్తవానికి రుతుపవనాలు బలహీన పడటంతో హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆశించిన మేర వర్షాలు కురవట్లేదు. ఉపరితల ఆవర్తనం వల్ల ఒడిశా, పశ్చిమబెంగాల్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలతోపాటు తెలంగాణ జిల్లాల్లో జులై మొదటివారంలో భారీవర్షాలు కురవవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్ర నిపుణులు రాజారావు చెప్పారు. రుతుపవనాల ప్రభావం కారణంగా మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం వుందని వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు