భారత్ తరపున 17 యేళ్ల తర్వాత మిస్ వరల్డ్ 2017గా టైటిల్‌కు ఎంపికైన ఆరో మహిళ మానుషి చిల్లార్. 2000 సంవత్సరంలో టైటిల్ దక్కించుకున్న ప్రియాంక చోప్రా తర్వాత ఇప్పుడు ప్రపంచ సుందరిగా ఎంపికైన భారతీయ మహిళ. ఏకంగా 108 మందితో పోటీ పడి.. అందరినీ వెనక్కి నెట్టిన మానుషి.. నవంబర్ 18న చైనాలోని సన్యా నగరంలో జరిగిన ఫైనల్స్‌లో విజేతగా ప్రపంచ విజేతగా నిలిచింది.
మిస్ వరల్డ్‌గా నిలిచిన ఈ హర్యానా బ్యూటీకి దేశ నలుమూలల నుంచి ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కూడా చేరిపోయారు. ‘మానుషి.. భారత్ గర్వపడేలా చేశారు’ అని ప్రశంసిస్తూ పూరీ తీరంలో ఆమె సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. మానుషి చిల్లార్ ప్రపంచ సుందరి కిరీటం ధరించిన సైకత శిల్పాన్ని నిర్మించారు. వెనుక మువ్వన్నెల జాతీయ జెండా, మానుషి చిల్లార్‌కు శుభాకాంక్షలు, మిస్ వరల్డ్ 2017 అని చెక్కిన సైకతశిల్పం అద్భుతంగా ఉందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.