వివరాల్లోకి వెళితే.. కచురా గ్రామానికి చెందిన సమరి ప్రధాన్(35) ఇంట్లో బాగా పండిన పనసపండు వున్నది. అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో పనసపండు సువాసనను గ్రహించిన ఐదు ఏనుగులు వారి ఇంటిని చుట్టుముట్టాయి. ఆ సమయంలో సమరి ఆమె కుమారుడు శత్రఘ్నుడు (6) ఇంట్లో ఉన్నారు. ఇంట్లోకి ప్రవేశించిన ఏనుగులు సమరిని, శత్రఘ్నను తొండంతో పైకెత్తి విసిరికొట్టి చంపేశాయి.
స్థానికుల సమాచారం అందేలోపు ఏనుగులు ఇంటి నుంచి వెళ్ళిపోయాయి. అటవీ అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. తరచుగా తమ గ్రామంపై ఏనుగుల దాడి చేస్తున్నాయని, దీనిని నివారించాలని గ్రామస్థులు అధికారులను విజ్ఞప్తి చేశారు. కాగా సమరి భర్తను కోల్పోయింది. ఆమెకు మరో కుమారుడున్నాడు. అతనిని ఇటీవలే హాస్టల్‌లో చేర్చిన సమరి.. ఆమె అమ్మ, రెండో కుమారుడితో కచురాలో వుంటోంది.