ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును ఏడు ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా కేంద్రం విడగొట్టింది. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ కొత్త కంపెనీలు పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
మన లక్ష్యం కేవలం ఇతర దేశాలతో సమానం కావడం కాదని, ప్రపంచ దేశాలను లీడ్ చేసే స్థాయికి ఎదగాలని చెప్పారు. ఇందుకోసం కొత్తగా ఏర్పాటైన ఏడు ప్రభుత్వ రంగ డిఫెన్స్ కంపెనీలు రీసెర్చ్, కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధాని మోడీ సూచించారు.
గడిచిన ఐదేండ్లలో భారత్ నుంచి డిఫెన్స్ ఎగుమతులు 315 శాతం పెరిగాయని, ఇది మరింత పెంచేలా కృషి చేస్తామని అన్నారు. కాగా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును ఏడు ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా విడగొట్టడం చారిత్రక నిర్ణయమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కొత్త కంపెనీలతో రక్షణ రంగం సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు.