దేశంలో మరోసారి పెరిగిన చమురు ధరలు

శనివారం, 30 అక్టోబరు 2021 (12:30 IST)
దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దేశంలో పెట్రోల్​, డీజిల్​పై ధరల పెంపు కొనసాగుతోంది. 
 
తాజాగా లీటర్​కు 35 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.108.99కు చేరగా.. డీజిల్​ ధర రూ.97.73కు పెరిగింది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర 33 పైసలు పెరిగి రూ.114.77కు చేరగా.. లీటర్​ డీజిల్ 38 పైసలు పెరిగి​​ రూ.105.83 వద్ద కొనసాగుతోంది.
 
కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ ధర 34 పైసలు పెరిగి రూ.109.42గా ఉంది. లీటర్​ డీజిల్ ధర 35 పైసలు పెరిగి రూ.100.80 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు పెరిగి రూ.105.70 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర 33 పైసలు రూ.101.88కు చేరింది.
 
హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.113.32కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.106.56 కి చేరింది. గుంటూరులో పెట్రోల్ ధర లీటర్​కు రూ.115.30కి చేరింది.

డీజిల్​పై 36 పైసలు పెరిగి​ లీటర్ రూ.107.92 వద్ద కొనసాగుతోంది.  వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.03 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.106.69కి చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు