కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ పాయల్ మరో వివాహానికి సిద్ధమవుతున్నారు. తన భార్య పాయల్‌తో వివాహం బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టును కోర్టును ఆశ్రయించారు. తన భార్య పాయల్‌తో వివాహ బంధం తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతీసిందని అన్నారు. మరో వివాహం చేసుకునేందుకు ఆమెతో విడాకులు ఇప్పించాలని ఒమర్ అబ్ధుల్లా కోర్టును విజ్ఞప్తి చేశారు.
పాయల్-ఒమర్ అబ్ధుల్లా దంపతులకు 1994, సెప్టెంబర్ 1వ తేదీన వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు వున్నారు. కానీ 2007లోనే ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో 2009 నుంచి వీరు విడివిడిగా వుంటున్నారు. దీంతో 2016, ఆగస్టు 30న తనకు పాయల్ నుంచి విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒమర్ ట్రయల్ కోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.