జార్ఖండ్ రాష్ట్రంలో పెను ప్రమాదం .. ఇంట్లోకి దూసుకెళ్లి విమానం

శుక్రవారం, 24 మార్చి 2023 (11:23 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో పెను ప్రమాదం తప్పింది. విమానం ఒకటి ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది. ధన్‌బాద్‌ నగరంలో ఈ సంఘటన జరిగింది. చిన్నపాటి విమానం ఒకటి నియంత్రణ కోల్పోయి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విమానం పైలెట్‌తో సహా 14 యేళ్ల బాలుడు గాయపడ్డారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ధన్‌బాద్ బార్వాడ్డ్ ఏర్‌‍స్ట్రిప్ నుంచి ఓ తేలికపాటి విమానం ఒకటి బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్‌పోర్టుకు 500 మీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంటి పిల్లర్‍‌ను ఢీకొట్టింది. దీంతో విమానం ముక్కలు ముక్కలైంది. ఈ ప్రమాదంలో అందులో పైలెట్‌తో సహా ఓ బాలుడు గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఈ ఘటనలో ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి గాయాలు తగలేదని ఇంటి యజమాని నీలేశ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు