ఒకడికి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్.. యువతి చేసిన పనికి కరోనా అంటుకుందా?

బుధవారం, 22 ఏప్రియల్ 2020 (19:21 IST)
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండోర్‌లో ఓ యువతి ఇద్దరు బాయ్‌‌ఫ్రెండ్స్‌కి కరోనా అంటించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో ఇంకా తేలాల్సి వుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోర్‌లోని లుసాడియా గ్రామానికి చెందిన ఒక యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది. 
 
అప్రమత్తమైన అధికారులు ఆ యువతికి చికిత్స అందిస్తూ ఆమె ఎవరెవరితో తిరిగిందో తెలుసుకుని వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. మొదటగా ఆమె కుటుంబ సభ్యులను, తర్వాత బాయ్ ఫ్రెండ్ కుటుంబాన్ని ఐసోలేషన్‌లో ఉంచారు. ఆ తర్వాత విచారణలో ఆ అమ్మాయికి మరో ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలియడంతో ఆ ముగ్గురు కుటుంబాల వారిని తీసుకెళ్లి ఐసోలేషన్‌లో ఉంచారు. 
 
వారిని విచారించగా మొత్తం నలుగురు బాయ్ ఫ్రెండ్స్‌లో ఒకడికి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసుకున్న అధికారులు మళ్లీ అప్రమత్తమయ్యారు. వారిని వెతికే పనిలో వున్నారు.. పోలీసులు. ఈ వార్తను కమల్ ఖాన్ ట్విట్టర్‌లో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు