కోట చుట్టుపక్కల, ఇతర వ్యూహాత్మక ప్రదేశాలలో ఫేస్ రికగ్నిసేషన్, వీడియో అనలిటిక్ సిస్టమ్‌లతో కూడిన 1,000 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
మరోవైపు దాయాది దేశం నుంచి భారత కోడలిగా వచ్చిన పాకిస్తాన్ పౌరురాలు సీమా హైదర్, భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు నోయిడాలో తన కుటుంబంతో కలిసి భారత జెండాను ఎగురవేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సచిన్ మీనాతో కలిసి జీవించడానికి పాకిస్థాన్ నుంచి ఆమె భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీమా హైదర్ భారత జెండా పట్టుకుని వున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని వారి నివాసంలో "హర్ ఘర్ తిరంగ" వేడుకల్లో భాగంగా సీమా హైదర్, సచిన్ మీనా ఆదివారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
త్రివర్ణ పతాక చీర ధరించి, దేశభక్తితో కూడిన తలకట్టు ధరించి, ఆమె ''జై మాతా ది'' నినాదాలు చేస్తూ ''భారత్ మాతా కీ జై'', ''వందేమాతరం'' నినాదాలు చేయడం కూడా వీడియోలో వినబడింది.