అయితే అంతకుముందుగా సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో ఆమె నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం చేస్తున్న ఈ సిరీస్ ఆమెకు భారీ పారితోషికం ఇస్తున్నారట. కాగా, రంజిత్ రూపొందిస్తున్న సినిమా సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.  దీనికి వెట్టువం అనే టైటిల్ పెడుతున్నట్లు సమాచారం. ఇందులో దినేష్ హీరోగా నటిస్తుండగా, జోడీ శోభిత ధూళిపాళ నటిస్తోందని సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి.