తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు ప్రయాణీకుల ట్రాలీ బ్యాగ్‌లో 47 పాములు, అరుదైన రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరస్థుడిని మహమ్మద్ మొయిదీన్‌గా గుర్తించారు.
అటవీశాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం సరీసృపాలను తిరిగి మలేషియాకు పంపించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. విచారణ నిమిత్తం మొయిదీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.