ప్రధాని నరేంద్ర మోడీ గత కొన్ని రోజులుగా పెరిగిన జుట్టు, గడ్డంతో కనిపిస్తున్నారు. ముఖ్యంగా, అయోధ్యలో శ్రీ రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేసిన తర్వాత నుంచి ఆయన గడ్డం, మీసాలు పెంచుతున్నారు. ఇప్పటివరకు ఆయన గడ్డం పెంచిన దాఖలాలు లేవు. దీంతో ఇపుడు కొత్తగా గడ్డం, తల వెంట్రుకలు పెంచడంతో ప్రతి ఒక్కరికీ అనుమానంతో పాటు.. చర్చించసాగారు.
అయితే, ప్రధాని మోడీ గడ్డం పెంచడానికి గల కారణాన్ని అయోధ్య రామమందిర ట్రస్టు సభ్యుడు, ఉడుపి పెజావర పీఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ కర్నాటకలోని బాగల్కోటెలో మీడియాతో మాట్లాడారు.
ప్రధానంగా, ఇలాంటి చరిత్రాత్మక నిర్మాణాలు చేపట్టే సమయంలో కేశాలను తొలగించరని, మోడీ గడ్డం, జుట్టు కత్తిరించకపోవడానికి ఇదే బలమైన కారణమై ఉండొచ్చుని అభిప్రాయపడ్డారు.