సెలూన్ల‌కు అనుమతి

సోమవారం, 4 మే 2020 (21:32 IST)
లాక్‌డౌన్-3 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా గైడ్‌లైన్స్ ఇచ్చింది. దీని ప్రకారం సెలూన్లు కూడా తెరుచుకునేందుకు అవకాశం ఇచ్చారు.

అయితే సెలూన్లలో కటింగ్ లేదా షేవింగ్‌కు ఒకరికే అనుమతి ఇస్తున్నారు. కటింగ్ లేదా షేవింగ్ చేయించుకునే వ్యక్తితో పాటు కటింగ్ చేసే వ్యక్తి మాత్రమే సెలూన్‌లో ఉంటారు.

మిగతా వారంతా సోషల్ డిస్టన్స్ పాటించడంలో భాగంగా బయట ఉంటారు. 40 రోజుల గ్యాప్ తర్వాత సెలూన్లు తెరుస్తున్నారు. దీంతో తొలుత సెలూన్లను శానిటైజ్ చేశాకే కటింగ్ పనులు ప్రారంభించాలని సెలూన్ల యజమానులకు ఆదేశాలందాయి.
 
కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. తొలి దశ, రెండో దశ కలిపి ఇప్పటికే 40 రోజులు దాటాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి‌పై ప్రజల్లో అవగాహన పెరిగింది. షేవింగ్ చేసుకోవడం వచ్చినవారు ఇంట్లోనే చేసుకుంటున్నారు.

షేవింగ్ చేసుకోవడం రానివారు గడ్డాలు పెంచేస్తున్నారు. కటింగ్ విషయానికొస్తే కొన్ని చోట్ల ఇంటి వద్దకే సెలూన్ వర్కర్లు వచ్చి కటింగ్ చేస్తున్నారు.

మరికొందరు తామే తమ చిన్నారులకు కటింగ్ చేస్తున్నారు. 40 రోజులుగా పెరిగిన జుత్తు, గడ్డాలతో సెలూన్లు ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని జనం ఎదురుచూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు