రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం... పైలెట్ మృతి

ఠాగూర్

బుధవారం, 9 జులై 2025 (15:15 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుది. యుద్ధ విమానం ఒకటి కుప్పకూలిపోయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని చూరు జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పైలెట్ ప్రాణాలు కోల్పోయారు. చూరు జిల్లా పరిధిలోని ఓ ప్రాంతంలో భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ విమానం కూలిపోయినట్టు స్థానిక అధికారులకు సమాచారం అందింది. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద సమాచారం తెలియడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు