టర్కీ భూకంపంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి - సాయం చేసేందుకు సిద్ధం

సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (14:03 IST)
టర్కీలో సంభవించిన భారీ భూకంపంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విధ్వంసక భూకంపాన్ని మనమంతా చూస్తున్నామని ఆయన అన్నారు. ఈ టర్కీ భూకంప బాధితులకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం సంభవించిన ఈ భూకంపంలో దాదాపు 100 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయంతెల్సిందే.
 
మరోవైపు, సోమవారం బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్‌ 2023ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 21వ శతాబ్దంలో ప్రపంచ భవిష్యత్‌ను నిర్ణయించడంతో ఇంధన రంగం ప్రధాన పాత్రను పోషిస్తుందని తెలిపారు. కొత్త శక్తి వనరులను అభివృద్ధి చేయడంలో, శక్తి పరివర్తనలో భారత్ నేడు బలమైన దేశంగా ఉందని పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, జీ20 ప్రెసిడెన్సీ క్యాలెండరులో ఇది మొదటి ప్రధానమైన ఈవెంట్ అని చెప్పారు. ఇండియా ఎనర్జీ వీక్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. బెంగుళూురు సాంకేతికత, ప్రతిభ ఆవిష్కరణల శక్తితో నిండిన నగరం అంటూ ప్రధాని మోడీ కొనియాడారు. నిరంతరం యువశక్తిని ఉపయోగించుకుంటూ ఉండాలని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి