కాగా బీజేపీ కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఏపీ సీఎ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు కుమారుడు మంత్రి నారాలోకేష్‌కు ఉషోదయం.. ఏపీకి సూర్యాస్తమయం అన్న చందంలో అక్కడ పాలన జరుగుతుందని విమర్శించారు. నారా లోకేష్ జీవితంలో వెలుగులు నింపడం కోసం ఏపీని బాబు అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు.
గతంలో అధికారం కోసం ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు జగమెరిగిన సత్యమని.. అయితే ఎన్టీఆర్ జీవిత కాలం పోరాడిన కాంగ్రెస్‌తో కలవడం ద్వారా ఆయనకు రెండోసారి బాబు వెన్నుపోటు పొడిచారని.. మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్టీఆర్ ''కాంగ్రెస్ ముక్త్ భారత్'' పోరాటం చేస్తే.. అధికారం కోసం కాంగ్రెస్ ముందు బాబు శిరస్సు వంచారని విమర్శించారు. తద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని మంటగలిపారని ఫైర్ అయ్యారు.