ఇక.. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల కోసం 2014 జూన్ మాసం నుంచి ఇప్పటి వరకు రూ.2,021 కోట్లు వ్యయం చేశారు. అద్దె విమానాలు, విమానాల నిర్వహణ, హాట్‌లైన్ వసతుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి 2018 వరకు పర్యటించిన దేశాలు ప్రస్తుతం భారత్‌లో అత్యధిక విదేశీ పెట్టుబడులు చేసిన టాప్-10 దేశాల్లో ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2014లో 30,950.5 మిల్లియన్ డాలర్లుగా ఉండగా...ఇది 2017నాటికి 43,478.27 మిల్లియన్ డాలర్లకు పెరిగినట్లు వీకే సింగ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.