అమ్మాయిలను ఎరవేసి వ్యాపారం చేస్తారా... ఫార్మా కంపెనీలపై మోడీ ఫైర్

మంగళవారం, 14 జనవరి 2020 (10:52 IST)
దేశంలోని ఫార్మా కంపెనీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ఫార్మా కంపెనీలు అమ్మాయిలను ఎరవేసి వ్యాపారం చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన స్కామ్ ఒకటి వెలుగుచూసింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. వైద్యులకు యువతులను ఎరవేస్తూ, వారిని విదేశీ విలాస యాత్రలకు పంపుతూ, ఖరీదైన వస్తువులను బహుమతులుగా ఇచ్చే సంప్రదాయాలను మానుకోండని ఫార్మా కంపెనీలకు హితవు పలికారు. 
 
తాజాగా దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలైన జైడస్‌ కాడిలా, టోరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌, వోక్‌హార్ట్‌, అపోలో సహా అనేక ప్రముఖ మందుల తయారీ, విక్రయ కంపెనీల యాజమాన్యాలతో మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ పై వ్యాఖ్యలు చేశారు. 'సాథీ' అనే ప్రభుత్వేతర సంస్థ నివేదిక బయటికొచ్చాక ముఖ్యమైన ఫార్మా కంపెనీలతో పీఎంవో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 
 
'మార్కెటింగ్‌లో నీతి, విలువలు పాటించండి. లేదంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. తీవ్రమైన చట్టాలు చేస్తాం' అని ప్రధాని వారిని హెచ్చరించారు. ఈ దుస్సంప్రదాయాలకు కట్టడిచేసే చట్టాలు, నిబంధనలు రూపొందించాలని ఇప్పటికే రసాయనాలు, ఎరువులు, వైద్య ఆరోగ్య శాఖలను ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు