జపాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ... 40 గంటల్లో 23 సమావేశాలు..

సోమవారం, 23 మే 2022 (15:40 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇటీవలే ఒక్క రోజు పాటు నేపాల్ దేశ పర్యటనకు వెళ్లిన ఆయన ఇపుడు రెండు రోజుల పాటు జపాన్ దేశ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన 40 గంటల్లో 23 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందులో క్వాడ్ సదస్తుతో పాటు జపాన్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ఆయన భేటీకానున్నారు.
 
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు టోక్యోకు చేరుకున్న ప్రధాని ఓ హోటల్‌లో బస చేయనున్నారు. ఇక్కడ జరిగే క్వాడ్ దేశాల సదస్సులో పాల్గొని పలు దేశాధినేతలతో ఆయన చర్చలు జరుపనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఏకంగా 40 గంటల్లో 23 సదస్సుల్లో పాల్గొనున్నారు.
 
జపాన్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో కూడా ఆయన భేటీ అవుతారు. ఈ పర్యటన భారత్ జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా విస్తృత స్థాయి చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు