భారత్‌తో సహా 15 దేశాలకు ప్రయాణాలు వద్దు - సౌదీ హెచ్చరిక

సోమవారం, 23 మే 2022 (08:48 IST)
ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులతో పాటు మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ ప్రజలకు కీలక సూచనలు చేసింది. భారత్ సహా 15 దేశాల్లో ప్రయాణించవద్దని కోరింది. 
 
సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ పౌరులకు ప్రయాణ నిషేధం విధించిన దేశాల జాబితాలో భారత్, సిరియా, లెబనాన్, టర్కీ, ఇరాన్, ఆప్ఘనిస్థాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, అర్మేనియా, బెలారస్, వెనెజులా వంటి దేశాలు ఉన్నాయి. 
 
అదేసమయంలో పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయని, కానీ తమ దేశంలో మాత్రం అలాంటి కేసులు లేవని సౌదీ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అబ్దుల్లా అసిరి వెల్లడించారు. ఒకవేళ అలాంటి కేసు వెలుగు చూసినా దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు