ఇకపై ఆగస్టు 15వ తేదీని సంకల్ప్ పర్వగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మన్ కీ బాత్‌లో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ... సంకల్ప్ పర్వగా ఆగస్టు 15వ తేదీని జరుపుకొని... దేశంలో నాటుకుపోయిన అవినీతి, పేదరికం, ఉగ్రవాదం, అపరిశుభ్రత, కులతత్వం, మతతత్వాన్ని రూపుమాపుతామని ప్రతి భారతీయుడు ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎన్ని జనరేషన్లు మారినా.. దేశ అభివృద్ధి కోసం చేయాల్సిన సంకల్పం మాత్రం ఒక్కటే అని ఈ సందర్భంగా స్పష్టంచేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంటలు కోల్పోయిన చోట వెంటనే బీమా అందేలా చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. అసోం, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్‌లో వరదలు తీవ్ర ప్రభావం చూపాయాని మోడీ పేర్కొన్నారు.