ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షాబాజ్ షరీప్ మాత్రం మరోలా స్పందించారు. కాశ్మీర్ అంశం పరిష్కారమైతేనే భారత్‌తో సఖ్యత సాధ్యమవుతుందని చెప్పారు. అంతేకాకుండా, ఆర్టికల్ 370 రద్దు, అనేక చర్యల ఫలితంగా కాశ్మీర్‌లో ప్రజలు నెత్తురోడుతున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ అంశం తేలాకే ఇతర అంశాలపై దృష్టిపెడదామంటూ ఆయన తేల్చి చెప్పారు.
అంతకుముందు పాక్ ప్రధాని షాబాజ్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఉగ్రవాదానికి తావులేదని పేర్కొంటూ భారత్ శాంతి సుస్థిరతను కోరుకుంటుదన్నారు. "అందుకే మనం అభివృద్ధి సవాళ్ళపైనే దృష్టి నిలిపి, మన ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం పాటుపడదాం" అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.