టీ తాగి ఇద్దరు మహిళల మృతి: టీలో పురుగుల మందు ఎలా కలిసింది?

మంగళవారం, 20 డిశెంబరు 2016 (15:12 IST)
టీకి వేళాయె అనుకుని వేడి వేడి టీని తాగారు. అయితే టీ రూపంలో ఇద్దరు మహిళలను యముడు వెతుక్కుంటూ వచ్చాడు. టీ తాగిన పాపానికి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని కైమూర్ జిల్లాలోని సొత్వా గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన వారంతా సోమవారం టీ తాగిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. 
 
పురుగు మందు కలిసిన టీని తాగేయడంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా అనారోగ్యం పాలైయ్యారని డీఎస్పీ శివకుమార్ రౌత్ చెప్పారు. ఆ టీలో పురుగుమందు కలిసిందని ఆయన వివరించారు. ఈ ఘటనలో  దీంతో జస్వంతి దేవి (65), ఆమె కుమార్తె షీలా దేవి (45) మరణించారని, మరో ఆరుగురు అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. 
 
మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి, అనారోగ్యానికి గురైన వారికి ఆస్పత్రిలో చేయిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. టీలో పురుగుల మందు ఎలా కలిసిందనే దానిపై దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి