పంజాబ్ పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి..

శనివారం, 10 డిశెంబరు 2022 (14:24 IST)
పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా తరణ్‌లోని పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి జరిగింది. తేలికపాటి రాకెట్‌తో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అమృతసర్-భటిండా హైవేలోని సర్హాలి పోలీస్ స్టేషన్‌పై తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
రాకెట్ లాంచ్ రకం ఆయుధంతో జరిగిన ఈ దాడిలో భవనం కొంత ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులే ఈ రాకెట్ దాడికి పాల్పడి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరలో వున్న స్టేషన్‌పై దాడి జరగడంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పాత్ర కూడా వుండొచ్చునని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. 
 
ఈ ఏడాది మేలో ఏకంగా మొహాలీలోని పంజాబ్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపైనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అప్పుడు కూడా ఉగ్రవాదులు ఇలాగే తేలికపాటి రాకెట్‌తో దాడికి పాల్పడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు