అస్సాం - మేఘాలయ రాష్ట్రా మధ్య మళ్లీ ఉద్రిక్తలు చెలరేగాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఓ ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మేఘాలయ వెస్ట్ జైంటియా హిల్స్‌లోని ముక్కో గ్రామంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. కలప స్మగ్లింగ్‌ను అస్సాం అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడమే దీనికి కారణం.
కాల్పుల్లో అస్సాం ఫారెస్ట్ గార్డుతో సహా ఐదుగురు మేఘాలయా వాసులు చనిపోయారు. ఈ ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించగా, అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
మంగళవారం ఏడు గంటల ప్రాంతంలో కలపను స్మగ్లింగ్ చేస్తున్న ట్రక్కును అస్సాం అటవీ శాఖ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్మగ్లర్లు వాహనాని ఆపకపోగా మరింత వేగంగా పోనిచ్చారు. దీంతో అస్సాం ఫారెస్ట్ గార్డులు ఛేజ్ చేస్తూ కాల్పులు జరపడంతో ఆరుగు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు మేఘాలయ వాసులు, ఒక అస్సాం ఫారెస్ట్ గార్డు ఉన్నారు.