పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా కోల్‌కతాలోని రైన్ డ్రెంచ్డ్ రెడ్ రోడ్‌లో జరిగిన ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీపై మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, విభజించి పాలించే రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మతసామరస్యంలో పశ్చిమబెంగాల్ యావత్ దేశానికే ఒక ఉదాహరణగా నిలిచిందని మమత వెల్లడించారు. ఏకత్వం అనేది బెంగాలో ఉందని... దేశంలోని ఏ ఇతర ప్రాంతంలో ఇది కనిపించదని చెప్పుకొచ్చారు. అందుకే తామంటే బీజేపీకి నచ్చదన్నారు.
దేశంలో రాజకీయాలు ఐసోలేషన్‌లో వున్నాయని.. తాము ఐక్యతను కోరుకుంటున్నాము. "కలిసి జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మాకు సమాన హక్కులు ఉన్నాయి" అని మమతా బెనర్జీ అన్నారు.