వాయు కాలుష్యంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. వాయు కాలుష్యంతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు నానా తంటాలు పడుతుంటే.. గత ఏడాదికాలంలో భారత్, చైనా దేశాల్లో 16 లక్షలమంది మరణించారని తాజాగా వెల్లడైంది. పారిశ్రామికాభివృద్ధి వల్ల వాయు కాలుష్యం పెరిగి జనం మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని గ్రీన్ పీస్ అనే సంస్థ తెలిపింది. గ్రీన్ పీస్ సంస్థలో జరిపిన సర్వేలో.. వాహనాల పొగతో పాటు బొగ్గు కాల్చడం ద్వారా అధికంగా కాలుష్యం వెలువడుతుందని పేర్కొంది.
వాయు కాలుష్య మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న పది దేశాల్లో భారతదేశం ఉందని తేలింది. భారత్, చైనా దేశాలు వాయు కాలుష్యం పెరిగినా ఆర్థికాభివృద్ధి సాధించాయని తెలిపింది. రెండు దేశాల్లోనూ బొగ్గు వినియోగం పెరగటం వల్ల కాలుష్యం పెరిగిందని నివేదిక తేల్చింది. రెండు దేశాల్లోనూ లక్షమందిలో వాయుకాలుష్యం 115 నుంచి 138 మందిని ప్రభావితం చేసిందని గ్రీన్ పీస్ వివరించింది. అధిక ఆదాయం వస్తున్న దేశాలతో పోలిస్తే మన దేశంలో వాయుకాలుష్యం వల్ల మరణాల సంఖ్య నాలుగురెట్లు పెరిగింది.