ఇప్పటికే 2015-16, 2016-17, 2017-18, 2019-20 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఈ-ఫైలింగ్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను వెరిఫికేషన్ చేసుకోని వారికి ఐటీ శాఖ ఈ అవకాశం ఇచ్చింది.
పన్ను చెల్లింపుదారులు డిజిటల్ సంతకం లేకుండా ఆన్‌లైన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే ఆన్‌లైన్‌లోనే ఆధార్ ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా, బెంగళూరులోని సీపీసీకి సంతకం చేసిన ఐటీఆర్-వీ పత్రాలను పంపడం ద్వారా వెరిఫికేషన్ చేసుకోవచ్చు.