ఇక ఇంటి ముంగిటే ఆధార్ కార్డులో మార్పులు

మంగళవారం, 7 జూన్ 2022 (08:13 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డులో ఉండే తప్పొప్పులను ఇంటి ముంగిటే సరిదిద్దేలా చర్యలు తీసుకుంది. ఇందుకోసం పోస్ట్‌మేన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోనుంది. నిజానికి ప్రభుత్వం ఆధార్ కార్డులోని తప్పొప్పులు, ఇతర మార్పులు చాలా కష్టతరంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా 48 వేల మంది పోస్ట్‌మేన్‌లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ తప్పొప్పులను సవరించేందుకు వీలుగా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల సాయంతో సేవలు అందించనుంది. ఈ ప్రత్యేక కిట్‌ల ద్వారా ఆధార్ నంబరుతో మొబైల్ ఫోన్ నెంబరును అనుసంధానం చేయడం, ఇతర వివరాలను అప్‌డేట్ చేయడం, బాలల వివరాలను ఆధార్‌లో నమోదు చేయడం వంటి విధులను వీరికి కేటాయించనున్నారు. 
 
ఈ ప్రక్రియలో భాగంగా, పోస్ట్‌మేన్‌‌లకు 13 వేల మంది బ్యాంకింగ్ అధికారులు కూడా సహకరించేలా కేంద్రం ఆదేశారు జారీచేసింది. దేశంలోని మారుమల పల్లెల్లో సైతం ఆధార్ సేవలు అందించడమే తమ లక్ష్యమని యూఐడీఏఐ పేర్కొంది. ప్రస్తుత ట్యాబ్, మొబైల్ ఫోన్ల ద్వారా పోస్ట్‌మేన్‌లు పైలెట్ ప్రాజెక్టు కింద చిన్న పిల్లల వివరాలను సేకరిస్తున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే దేశ వ్యాప్తంగా ఆధార్ కార్డులోని తప్పొప్పులను ఇంటి ముంగిటే సరిదిద్దుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు