ప్రధాన్ మంత్రి బేరోజ్‌గర్ భట్టా యోజన' కింద నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం నెలవారీ రూ. 6,000 సహాయం అందిస్తోందని వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది.
కానీ ఫ్యాక్ట్ చెక్‌లో కేంద్రం అలాంటి ప్రతిపాదనను ముందుకు తీసుకురాలేదని స్పష్టం చేసింది. చేసింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి స్కీమ్ ఏదీ అమలు చేయడం లేదని, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని పీఐబీ కోరింది.
దేశంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలనెల రూ.6వేలు ఇవ్వనుంది. ప్రధాన్ మంత్రి బెరోజ్‌గర్ భట్టా యోజన 2022' కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీని కింద నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ. 6,000 లభిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.