తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టనున్నారనే వార్తలు వచ్చాయో లేదో.. ఉత్తరాదిన అప్పుడే కదలికలు మొదలయ్యాయి. తాజాగా కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పరచాలని అనుకుంటున్నారు.
జాతీయ స్థాయి రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ కీలక భూమిక పోషించే దిశగా మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో ఈ క్రమంలోనే ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశానికి రావాలంటూ పలు పార్టీలకు చెందిన 22 మంది జాతీయ స్థాయి నేతలకు దీదీ ఆహ్వానాలు పంపారు. ఇందులో భాగంగానే కేసీఆర్‌కు దీదీ ఫోన్ చేశారు.