మహారాష్ట్రలో కోవిడ్ వ్యాక్సిన్ల కొరత కారణంగా సోమవారం వరకు ముంబయిలోని ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లను మూసివేయనున్నట్లు బృహన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వ, మున్సిపల్ ఆసుపత్రుల్లో యథావిధిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.
కాగా, ముంబయి కార్పొరేషన్‌కు శుక్రవారం రాత్రికి వ్యాక్సిన్లు చేరుకునే అవకాశాలున్నాయని... తిరిగి టీకా ప్రక్రియను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. '99 వేల కోవిషీల్డ్ మోతాదులు చేరుకుంటాయి.