అయోధ్య మసీదు రూపశిల్పిగా ప్రొఫెసర్ అక్తర్

గురువారం, 3 సెప్టెంబరు 2020 (21:07 IST)
అయోధ్యలో సున్నీ వక్ఫ్ బోర్డు నిర్మిస్తున్న మసీదుకు కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్గా జామియా మిల్లియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎంపికయ్యారు. ఆర్కిటెక్చర్ విభాగాధిపతిగా ఉన్న ఎస్ఎం అక్తర్.. విశ్వవిద్యాలయంలో పలు భవనాల నిర్మాణంలో అనుభవంతో పాటు దిల్లీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు.
 
 అయోధ్య ధన్నీపుర్లో నిర్మించే మసీదు రూపకర్తగా జామియా మిల్లియా విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విభాగాధిపతి ఎస్ఎం అక్తర్ నియమితులయ్యారు. ఈ మసీదును ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) ట్రస్ట్ నిర్మించనుంది.
 
ఈ ప్రాజెక్టులో తన విద్యార్థులు కూడా భాగస్వాములు అవుతారని అక్తర్ వెల్లడించారు. "ప్రపంచవ్యాప్తంగా నా వద్ద అభ్యసించిన ఆర్కిటెక్టులు వెయ్యి మందికిపైగా ఉన్నారు. వాళ్లు నాతో కలిసి ఈ ప్రాజెక్టులో భాగమవుతారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తాం. ఇది వారికి గొప్ప అనుభవంగా ఉంటుంది."- ప్రొఫెసర్ అక్తర్, జామియా మిల్లియా విశ్వవిద్యాలయం

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు