మహారాష్ట్ర పుణెలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ వీడియో ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొండ్వాలోని ధ్వాడేకు చెందిన ఓ బాలిక యూట్యూబ్లో వీడియో చూసి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ నవజాత శిశువును కిటీకీలో నుంచి బయటకు విసిరేసింది. దీనిపై ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇదిలా ఉండగా.. వారు నివసిస్తున్న ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఓ నవజాత శిశువు స్థానికులకు కనిపించింది. అదే రోజు రాత్రి బాలిక ఆస్పత్రిలో కనిపించింది. దీంతో అనుమానం వచ్చి బాలికను ప్రశ్నించగా.. విస్తుపోయే నిజాన్ని వెల్లడించింది. తానే యూట్యూబ్లో వీడియో చూసి బిడ్డకు జన్మనిచ్చానని.. తరువాత బిడ్డను కిటికీ నుంచి కిందకు విసిరేసినట్లు చెప్పింది. ఈ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగుతోంది.